TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కావేరి జల వివాదంపై కేంద్రానికి సుప్రీం ఆదేశం....

Published on: Thu May 3, 2018 3:03PM

 

గత కొద్దికాలంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి నది జల వివాదంపై ఆందోళనలు జరగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవల జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కూడా అన్నాడీఎంకే ఎంపీలు నిరసనలు వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. ఇప్పుడు ఇస్తున్నదానికంటే అదనంగా 4 టీఎంసీల కావేరీ నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశించింది. నిజానికి ఫిబ్రవరిలోనే సుప్రీం కోర్టు దీనిపై తీర్పునిచ్చింది. తమిళనాడు కంటే కర్ణాటకకు అధిక టీఎంసీల నీరు విడుదల చేయాలని స్పష్టం చేసింది. దాంతో తమిళనాడులో ఆందోళనలు చేపట్టారు. అంతేకాదు.. తమిళనాడులో కావేరీ యాజమాన్య బోర్డు ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు. అయితే దీనిపై స్పందించిన కోర్టు...కేంద్రం ముసాయిదాను ప్రవేశపెడితే తప్ప ఈ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకోలేమని వెల్లడించింది.

 

సుప్రీంకోర్టు గత ఆదేశాల మేరకు కావేరీ యాజామాన్య బోర్డు ఏర్పాటు విషయంలో ముసాయిదాను కేంద్రం సర్వోన్నత న్యాయస్థానానికి అందజేయాలి. కానీ, కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర మంత్రులు ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో ముసాయిదాను అందజేయలేకపోయారు.  అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.