TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ధీరూభాయ్ అంబానీ పద్మవిభూషన్ పురస్కారానికి అర్హుడే....

Published on: Fri Mar 10, 2017 4:05PM

 

రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ పద్మవిభూషన్ పురస్కారానికి పూర్తిగా అర్హుడే అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ధీరూభాయ్ అంబానీకి పద్మవిభూషన్ పురస్కారాన్ని అందించారు. అయితే  శ్రీవాస్తవ అనే లాయర్  ధీరూభాయ్ అంబానీ ఎలాంటి అసాధారణమైన, ప్రత్యేకమైన సేవలను అందించలేదని.. అందుకే ఆయనకు ఇచ్చిన పురస్కారాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు..  పద్మవిభూషన్ పురస్కారానికి ధీరూభాయ్ అంబానీ అర్హుడేనని.. పద్మవిభూషణ్ పురస్కారం ఎవరికి ఇవ్వాలో చెప్పే అధికారం మీకు లేదని తేల్చి చెప్పింది. కాగా పద్మవిభూషన్ ను ధీరూభాయ్ తరపున ఆయన సతీమణి కోకిలాబెన్ స్వీకరించిన సంగతి తెలిసిందే.