కేంద్ర బడ్జెట్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..

 

కేంద్ర బ‌డ్జెట్‌ ప్రవేశపెట్టడానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి 1 వ తేదీన పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. బడ్జెట్ ను ప్రవేశపెట్టడం వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే ఇవాళ పిటిషన్  పై విచారించిన కోర్టు ఫిబ్ర‌వ‌రి 1నే ప్ర‌వేశ‌పెట్ట‌డానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. రాష్ట్రాల్లో త‌ర‌చూ ఎన్నిక‌లు జ‌రుగుతూనే ఉంటాయ‌ని, వాటివ‌ల్ల కేంద్రం త‌న ప‌నులు మానుకోలేద‌ని తేల్చిచెప్పింది. ఏడాది మొత్తం ఎన్నిక‌లు జ‌రుగుతూనే ఉంటే కేంద్రం త‌న బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌కూడ‌దా? అని ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది.