బీసీసీఐ-లోథాకమిటీ.. తుది తీర్పు

 

బీసీసీఐ-లోథా కమిటీల మధ్య వార్ నడుస్తూనే ఉంది. ఈ రోజు కూడా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ కాస్త అస్వస్థతతో ఉండడంతో సోమవారం విచారించాల్సిన కేసును ఈనెల 9కి వాయిదా వేశారు. ఆరోజే తుది తీర్పు వెల్లడించే అవకాశముంది.

 

కాగా లోథా కమిటీ లోధా కమిటీ ప్రతిపాదించిన కొన్ని సంస్కరణల అమలుపై బీసీసీఐ వ్యతిరేక వైఖరిని కొనసాగించిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల వయోపరిమితి 70 ఏళ్లు, రెండు పదవుల మధ్య 3 ఏళ్ల విరామం (కూలింగ్‌ ఆఫ్‌ పిరియడ్‌), ఒక రాష్ట్రానికి ఒక ఓటు వంటి కొన్ని అంశాలను అమలు చేయడంలో ఇబ్బందులు ఉన్నాయని బోర్డు వ్యతిరేకిస్తోంది. మరి తుది తీర్పు ఏం వస్తుందో వెయిట్ చేయాల్సిందే.