దోషులుగా రుజువైతే పోటికి అనర్హులే

 

గతంలో దోషులుగా రుజువైన వారు ఎలక్షన్లలో పోటికి అనర్హులంటూ వ్యాఖ్యానించిన సుప్రిం కోర్టు మరోసారి అదే వ్యాఖ్యను చేసింది. తాము ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించే ఆలోచనే లేదన్న సుప్రీం నేరస్థులుగా రుజువైతే చట్టసభలకు పోటీ చేయడానికి అనర్హులంటూ తేల్చింది.

జూలై 10న సుప్రిం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలిచాలంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అయితే తాము ఇచ్చిన తీర్పు పార్టమెంట్‌కు నచ్చని పక్షంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణలు చేసుకునే హక్కు పార్లమెంట్‌కు ఉందని తేల్చి చెప్పింది.

అయితే గతంలో నేరారోపణ ఎదుర్కొంటున్న వారు కూడా పోటికి అనర్హులంటూ తీర్పు చెప్పిన కోర్టు ప్రస్థుతం వారి విషయంలో పునఃపరిశీలనకు అంగీకరించింది.