ఆర్5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
Published on: Wed May 17, 2023 3:35PM
అమరావతిలో పేదల ఇళ్ల స్థలాల కేటాయింపునకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు పేదలకు ఉందని సుప్రీం పేర్కొంది.
చట్ట ప్రకారమే 5 శాతం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కు చెందిన వారికి ఇళ్ల స్థలాలివ్వాలని సుప్రీం కోర్టు పేర్కొంది. సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్ 53.1డీ ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని తన ఉత్తర్వులలో పేర్కొంది.
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీంకోర్టులో జస్టిస్ కె ఎం. జోసెఫ్ , జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం (మే 17) విచారించింది.


