Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రజనీకాంత్‌కు చేదు అనుభవం
posted on: May 31, 2018 10:55AM

అతను పరిచయం అవసరం లేని సూపర్‌స్టార్! లక్షలాది మంది అభిమానులకు ఆరాధ్యదైవం. ఇక రాజకీయాల్లోకి వచ్చి ప్రభంజనం సృష్టించడమే ఆలస్యం అన్నట్లుంది. అలాంటి రజనీకాంత్ నిన్న ఓ ఆసుపత్రికి వెళ్లారు. తూత్తుకుడిలో జరిగిన పోలీసుకాల్పులో గాయపడిన వాళ్లని పరామర్శించడం ఆయన ఉద్దేశం. కానీ ఆసుపత్రిలో ఉన్న ఓ విద్యార్థి నాయకుడు అడిగిన ప్రశ్నకు ఆయన మనసే గాయపడి ఉంటుంది. కె. సంతోష్ రాజ్ అనే విద్యార్థి నాయకుడు మేకప్ లేని రజనీకాంత్‌ను పోల్చుకోలేకపోయాడు. ‘ఎవరు నువ్వు?’ అంటూ ఆయన ఐడెంటిటీ అడిగేశాడు. దాంతో బిక్కమొగం వేసిన రజనీ ఏం చెప్పాలో తోచక చల్లగా అక్కడ నుంచి జారుకున్నారు.






