TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాల‌ర్ ఎగ‌రేస్తున్న పీకే ఫ్యాన్స్‌.. జ‌గ‌న్‌కు దిమ్మ‌తిరిగేలా సూప‌ర్ హిట్‌..

Published on: Fri Feb 25, 2022 10:02AM

ప‌వ‌ర్ స్టారా మ‌జాకా. పీకేనా మ‌జాకా. భీమ్లా నాయ‌క్ దుమ్మురేపుతోంది. బాక్సులు బ‌ద్ద‌ల‌వుతున్నాయి. థియేట‌ర్ల టాప్ లేచిపోతోంది. కాస్త‌ గ్యాప్ త‌ర్వాత.. ప‌వ‌న్ ఫ్యాన్స్ కాల‌రెగ‌రేస్తున్నారు. ఫ్లెక్సీలు, దండ‌లు, కొబ్బ‌రికాయ‌లు, కాగితాలు, బొట్లు, నినాదాలు.. తెలిసిందేగా ప‌వ‌న్ మేనియా ఎలా ఉంటుందో...

తెలుగురాష్ట్రాలు ప‌వ‌న్ క‌ల్యాణ్ పూన‌కంతో ఊగిపోతున్నాయి. ఎక్క‌డ చూసినా.. ఒక‌టే టాక్‌. సినిమా ఎలా ఉంది? ఎవ‌రిని అడిగినా ఒకే ఆన్స‌ర్‌. దుమ్ము రేపుతోంది. సూప‌ర్ హిట్‌.. బంప‌ర్ హిట్‌. బాక్సాఫీస్ హిట్‌. త‌గ్గేదేలే. ప‌వ‌ర్‌స్టార్ దెబ్బ మామూలుగా ఉండ‌దు మ‌రి. 

డౌట్ ఉంటే.. ఓసారి థియేట‌ర్ల సైడ్ వెళ్లి చూడండి.. లేదంటే ఏదైనా ఛానెలో.. యూట్యూబో పెట్టి చూడండి.. తెలుస్తుంది.. భీమ్లా నాయ‌క్ రేంజ్ ఏంటో. ఆ హిట్ టాక్ ఎలా ఉందో. ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. భీమ్లా నాయ‌క్ మూవీ చూసి.. గ‌బ్బ‌ర్‌సింగ్‌ను మించి అంటున్నారు. ప‌వ‌న్ క్యారెక్ట‌ర్‌.. ఫైట్స్‌.. మేన‌రిజం.. డైలాగ్స్‌.. అన్నిట్లోనూ చించేశారంటున్నారు. రాణా కూడా సూప‌ర్ అంటున్నారు. మీరా జాస్మిన్ సైతం కుమ్మేసింద‌ని చెబుతున్నారు. అంతా పాజిటివ్ టాకే. నెగిటివ్ వినిపిస్తే కొట్టేసేలా ఉన్నారు పీకే ఫ్యాన్స్‌. 

ప‌వ‌ర్ స్టార్‌ను అడ్డుకునే పోటుగాడు లేడంటున్నారు. జ‌గ‌న్‌రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టినా.. బంప‌ర్ హిట్‌తో బుద్ధి చెప్పార‌ని చెబుతున్నారు. బెనిఫిట్ షోలు వేయ‌నీయ‌కుండా అడ్డుకున్నా.. ఐదో షో కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌కున్నా.. క‌లెక్ష‌న్లు త‌గ్గేదేలే.. అంటున్నారు. భీమ్లా నాయ‌క్ హిట్‌తో జ‌గ‌న్‌రెడ్డికి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ ఏంటో తెలుసొస్తుంద‌ని.. తొడ‌గొడుతున్నారు పీకే ఫ్యాన్స్‌.