TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డబ్బు ఎగ్గొట్టినవారి పేర్లు చెప్పండి- సుప్రీం కోర్టు!

Published on: Tue Feb 16, 2016 4:04PM

 

వేల రూపాయల రుణం కావాలంటే నానా ప్రశ్నలూ అడిగే బ్యాంకులు ఈ మధ్య వేల కో్ట్ల రుణాలని మాఫీ చేసేశాయి. 2013-1015 సంవత్సారాలకు మధ్య ఇలా లక్ష కోట్లకు పైగా డబ్బుని వదిలేసుకున్నాయి. ఈ పరిస్థితి చూసి సామాన్య మానవుడికే కాదు సుప్రీంకోర్టుకి కూడా ఒళ్లు మండినట్లుంది. రుణాలను ఎగ్గొట్టినవారిలో బడాబాబుల జాబితాను తన ముందు ఉంచమని రిజర్వ బ్యాంకును ఆదేశించింది సుప్రీం కోర్టు. 500 కోట్లకు మించి రుణాలను ఎగవేసిన వాళ్ల వివరాలు తనకి తెలియాల్సిందే అంది. గత అయిదు సంవత్సరాలుగా ఇలా ప్రభుత్వరంగ బ్యాంకుల రుణాలను ఎగవేసినవారి జాబితాను ఆరు వారాలలోగా తన ముందు ఉంచాలని నిర్దేశించింది. ఆడంబరమైన జీవితాన్ని గడుపుతూ ప్రభుత్వ రుణాలను ఎగ్గొట్టేవారిపై సుప్రీం కోర్టు ఈ సందర్భంగా విరుచుకుపడింది. మరి ఈ జాబితా తన ముందుకు వచ్చిన తరువాత ఉన్నత న్యాయస్థానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో!