రైజర్స్ ను గెలిపించిన పెరీరా

Sunrisers Hyderabad defeat Kings XI Punjab by five wickets, IPL 2013: Sunrisers beat Kings XI   by 5 wickets to move to top spot, Sunrisers beat Kings XI by 5 wickets

 

హైదబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై 5 వికెట్ల తేడాతో 7 బంతులు మిగిలి వుండగానే విజయాన్ని నమోదు చేసింది. ఈ స్టేడియంలో సన్ రైజర్స్ కు ఇది హ్యాట్రిక్ విజయం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కింగ్స్ ఎలెవన్ నాలుగు ఓవర్లలో ఇషాంత్ శర్మ బౌలింగ్ లో మన్ దీప్ 10 కీపర్ డికాక్ కు క్యాచ్ ద్వారా అవుట్ అవడంతో కేవలం 1 వికెట్ కోల్పోయి 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొట్టమొదటి సారిగా కింగ్స్ కెప్టెన్ గిల్ క్రిస్ట్ గాడిలో పడినట్టుగా కనిపించాడు. పెరీరా వేసిన ఐదో ఓవర్లో మూడు బౌండరీలు సాధించాడు .

వాల్తాటి (6) రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ గా, గిల్ క్రిస్ట్ (26)లను ఇషాంత్ శర్మ క్యాచ్ పట్టగా కరణ్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఆ తరువాత వచ్చిన పియూష్ చావ్లా, డేవిడ్ హస్సీ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ ను నిర్మించే పనిలో పడ్డారు. పియూష్ చావ్లా కరణ్ వేసిన ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టి తాను బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోట్ కావడం కరెక్ట్ అని నిరూపించాడు. కానీ చావ్లా 15 బంతుల్లో 23 పరుగుల (1 బౌండరీ 2 సిక్సర్లు) వద్ద రనౌట్ అయ్యాడు. ఆ తరువాత ఇషాంత్ శర్మ బౌలింగ్ లో హస్సీ 24 బంతుల్లో 22 పరుగులు (1 బౌండరీ 1 సిక్సర్) చేసి అక్షత్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. 17 ఓవర్లలో  5 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసిన కింగ్స్ ఇక మిగతా మూడు ఓవర్లలో కనీసం మరో ముప్పై పరుగులు చేస్తుంది అనుకున్న సమయంలో బౌలింగ్ కు దిగిన సన్ రైజర్స్ తురుపు ముక్క అమిత్ మిశ్రా వేసిన మొదటి మూడు బంతుల్లో రెండు బౌండరీలు, ఒక సింగిల్ చేసి 9 పరుగులు రాబట్టారు. ఇక్కడే అనూహ్యంగా మ్యాచ్ మలుపు తిరిగింది.

నాలుగో బంతికి అజహర్ మహమూద్ 4 ఆశిశ్ కు క్యాచ్ ఇచ్చి, మొన్నటి మ్యాచ్ లో రెచ్చిపోయి ఆడిన మన్ ప్రీత్ గోని ని 0 రనౌట్ ఐదో బంతిలో, ఆరు బంతిలో వోహ్రా భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ దగ్గర ఇషాంత్ శర్మ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. మరుసటి ఓవర్ ప్రారంభించిన స్టెయిన్ మొదటి బంతికే గురుకిరీత్ 12 బంతుల్లో 17 పరుగులు (1 బౌండరీ 1 సిక్సర్) అవుట్ చేశాడు. డిమిత్రి మస్కరెనాస్ 5 నాటౌట్, ప్రవీణ్ కుమార్ 3 నాటౌట్ గా నిలవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. అమిత్ మిశ్రా 2,కరణ్ 2,ఇషాంత్ శర్మ 2,స్టెయిన్ 1 వికెట్లు పడగొట్టారు.

స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి క్రీజ్ లోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్  కు మొదటి ఓవర్ నాలుగో బంతికే ఓపెనర్ డికాక్ 0ను ప్రవీణ్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేసి మెయిడెన్ ఓవర్ వేశాడు. మరో ఓపెనర్ అక్షత్ కు హనుమ విహారి జంటగా క్రీజ్ లోకి వచ్చి నిలకడగా ఆడుతూ స్కోరు పెంచుతూ వెళ్ళారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 48 పరుగులు జోడించిన సమయంలో గోని బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించిన అక్షత్ రెడ్డి 17 బంతుల్లో 19 పరుగులు (2 బౌండరీలు) బ్యాట్ క్రింది అంచు తీసుకుని మిడాన్ దగ్గర వున్న అజహర్ మహమూద్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరుకున్నాడు. సంగక్కర ఈ మ్యాచ్ కు దూరమవడంతో కెప్టెన్ కెమరూన్ వైట్ తన సహజ బ్యాంటింగ్ కు విరుద్దంగా ఆడాడు, కెమరూన్ వైట్ 23 బంతుల్లో 16 పరుగులు (1బౌండరీ) చేసి గోనీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హనుమ విహారీ 39 బంతుల్లో 46 పరుగులు (5 బౌండరీలు) చేసి హస్సీ క్యాచ్ పట్టగా పియూష్ బౌలింగ్ లో అవుటయ్యాడు. సమంత్రేను 10 పరుగుల వద్ద అజహర్ మహమూద్  ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ పంపాడు.

విజయానికి రెండు ఓవర్లలో 18 పరుగులు అవసరం ఉండగా పెరీరా 11 బంతుల్లో 22 పరుగులు (3 సిక్సర్లు) నాటౌట్ అజహర్ మహమూద్  వేసిన 19వ ఓవర్లో వీరవిహారం చేయడంతో సన్ రైజర్స్ విజయతీరం చేరుకుంది. ఆశీష్ రెడ్డి 7 బంతుల్లో 7 పరుగులు (1 బౌండరీ) పెరీరా కు చక్కటి సహకారం అందించాడు. గోనీ 2, పియూష్ చావ్లా 1, అజహర్ మహమూద్ 1, ప్రవీణ్ కుమార్ 1 వికెట్ పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన (46) హనుమ విహారీ ఎన్నికయ్యాడు. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల టేబుల్ టాప్ గా నిలిచింది.