TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సన్నీలియోన్ హైదరాబాద్ వస్తోందట.. అబ్బ...

Published on: Thu Dec 18, 2014 4:32PM

 

అబ్బబ్బ... ఇది నిజంగా సూపర్ న్యూస్.. అందాల బొమ్మ, అపరంజి కొమ్మ, కులుకులొలికే ముద్దుగుమ్మ సన్నీ లియోన్ హైదరాబాద్‌కి రాబోతోంది. అది కూడా ఏ సాదాసీదా కార్యక్రమానికో కాదు... న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని మస్త్ మజా చేయడానికి.. కుర్రకారుతో ఆడి పాడటానికి.. వావ్! అవును ఈసారి హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి బోలెడంతమంది సెలబ్రిటీలు రాబోతున్నారు. ఎవరొస్తే, ఎవరు రాకపోతే ఏంటి.. సన్నీ లియోన్ వస్తోంది.. హైదరాబాద్ కుర్రకారుకి ఇది చాలు. ఈ బాలీవుడ్ హాట్ భామ జూబిలీహిల్స్‌లోని ఓ పార్టీ సెంటర్లో డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి మస్త్ పార్టీలో పాల్గొంటుంది.. ఉత్సాహభరితమైన వాతావరణంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది. సన్నీ లియోన్‌ని తమ సిటీకి తీసుకెళ్ళాలని దేశవ్యాప్తంగా వున్న అనేక ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు ప్రయత్నించాయట. కానీ ఆ అవకాశం ఒక్క సంస్థకి మాత్రమే దక్కింది. అది కూడా మన హైదరాబాద్ సంస్థకే దక్కింది.. హైదరాబాద్ డెవలప్ అవుతోందని తెలుసుగానీ.. ఇంత డెవలప్ అవుతుందని ఎవరూ ఊహించి వుండరు..