TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కూలిపోయిన సుంకిశాల రిటెయినింగ్‌ వాల్!

Published on: Thu Aug 8, 2024 2:28PM

అధికారుల నిర్లక్ష్యం కారణంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సాగర్ కు పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో రక్షణ గోడ వెనుక గేటును ఏర్పాటు చేసి సొరంగాన్ని అధికారులు ఓపెన్ చేశారు. దీంతో సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది.

సొరంగాల్లోకి సాగర్‌ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన రిటెయినింగ్‌ వాల్‌ ఒక్కసారిగా కుప్పకూలడంతో సుంకిశాల పంపుహౌస్‌ నీట మునిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. రిటైనింగ్ వాల్ ఈనెల 1నే కూలిపోయింది. అయితే అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.  ఇక్కడ మూడు షిఫ్టుల్లో కూలీలు పని చేస్తుంటారు. ఘటన  కూలీలు షిఫ్టులు మారే సమయంలో జరగడంతో పెను ప్రమాదం తప్పింది. రిటైనింగ్ వాల్ కూలిపోయిన క్షణాల వ్యవధిలోనే పంప్ హౌస్ జలమయమైంది.