TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వివేకా హత్య కేసు.. మళ్లీ కోర్టును ఆశ్రయించిన డాక్టర్ సునీత

Published on: Tue Oct 7, 2025 10:44AM

వివేకా హత్య కేసు విచారణ కొనసాగించాలని కోరుతూ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో సూత్రధారులు ఇంకా బయటకు రావాల్సి ఉందని, విచారణ కొనసాగిస్తేనే అది జరుగుతుందని ఆమె సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి పిటిషన్ కాపీలను నిందితులకు అందేలా చూడాలన్నారు.  గతంలో ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సీబీఐ దర్యాప్తునకు గత ప్రభుత్వంలో ఆటంకాలు కలిగించారని, అధికార దుర్వినియోగం జరిగిందని ధర్మాసనం వ్యాఖ్యా నించింది.

దర్యాప్తును కొనసాగించాలని కోర్టు ఆదేశాసిస్తే కొనసాగిస్తామని సీబీఐ తెలిపింది. అయితే దర్యాప్తు కొనసాగింపుపై సుప్రీంకోర్టు.. నిర్ణయం తీసుకోకుండా,  ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది. ఈ విషయంలో ఎనిమిది వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీం పేర్కొంది. దీంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం  సూచనలతో వైఎస్ సునీత హైదరాబాద్ సీబీఐ కోర్టులో కేసు విచారణ కొనసాగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.