TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భీమవరంలో బుల్లోడి పాటల విడుదల

Published on: Fri Dec 20, 2013 10:36AM

 

సునీల్ హీరోగా ఉదయ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "భీమవరం బుల్లోడు". సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్లో డి.సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తీ చేసుకుంది. అనూప్ అందించిన పాటలను ఈనెల 22న భీమవరంలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. హీరో సునీల్ మాట్లాడుతూ.. "సినిమా మొదలు నుండి చివరి వరకు పొట్ట చెక్కలయ్యే కామెడి ఉంటుంది. అలాగే ఇందులో యాక్షన్, ఎమోషన్స్ ఉన్నాయి. ఈ చిత్రం నా కెరీర్ లో ఓ మైలురాయిలా నిలిచిపోతుంది" అని అన్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.