సోదాలు..ముగిసిన సునీల్ రెడ్డి సిబిఐ కస్టడీ
Published on: Mon Feb 6, 2012 2:55PM
హైదరాబా
ద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో అరెస్టయిన సునీల్ రెడ్డి నివాసంలో సిబిఐ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఆయనను తమ కస్టడీకి తీసుకుని మూడు రోజుల పాటు విచారించిన సిబిఐ మరోసారి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది. విల్లాల కొనుగోలుదారుల నుంచి సునీల్ రెడ్డి డబ్బులు వసూలు చేశాడని సిబిఐ అనుమానిస్తోంది. దీంతో ఆయనను అరెస్టు చేసి, విచారించింది. సునీల్ రెడ్డి సిబిఐ కస్టడీ సోమవారం ముగిసింది.
కాగా, బెయిల్ కోసం ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య పెట్టుకున్న పిటిషన్పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. తన నిర్ణయాన్ని కోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. ఎమ్మార్ కేసులో అరెస్ట్ అయిన కోనేరు ప్రసాద్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. దీనిపై సోమవారం విచారణ జరిపిన నాంపల్లి ప్రత్యేక సీబీఐ కోర్టు తదుపరి విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది.


