సభలో జోక్ పేల్చిన స్పీకర్...శాంతీ కే బాద్ హంగామా

 

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి చర్చలకంటే వాయిదాలే ఎక్కువ పడుతున్నాయి. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నేతల ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓ జోక్ పేల్చారు. ఎప్పటిలాగే ఈ రోజు లోక్ సభ ప్రారంభమైంది. అయితే ఈసందర్భంగా ఇటీవల మరణించిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ ఎంపీ భాను కుమార్ శాస్త్రికి లోక్ సభ నివాళులు అర్పించింది. ఆయన సేవలను గుర్తు చేసిన సుమిత్రా మహాజన్, శాస్త్రి ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించాలని సభ్యులను కోరారు. ఇక రెండు నిమిషాలు సైలెంట్ గా ఉన్న నేతలు.. రెండు నిమిషాలు పూర్తయిన వెంటనే.. నినాదాలకు దిగారు. ఇది చూసిన స్పీకర్.. "శాంతీ కే బాద్ హంగామా" (శాంతి తరువాత హంగామా) అంటూ జోక్ వేశారు. సభ్యులను వెనక్కు వెళ్లాలని ఆమె కోరినప్పటికీ, ఆ పరిస్థితి కనిపించక పోవడంతో సభను వాయిదా వేశారు.