TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

పార్టీ మార్పుపై సుజనా స్పందన...

Published on: Thu May 3, 2018 11:36AM


గత కొద్దిరోజులుగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి బీజేపీ పార్టీలో చేరుతున్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వార్తలపై స్పందించిన సుజనా చౌదరి ఇవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన... తాను తెలుగుదేశం పార్టీని వీడబోవడం లేదని స్పష్టం చేశారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా అధినేత ఆదేశాల మేరకే తీసుకున్నానని, కేంద్రం నుంచి బయటకు వచ్చేద్దామని తాను జనవరిలోనే చెప్పానని అన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర అవసరాలను తీర్చేందుకు ఎంతో కృషి చేశానని చెప్పారు. ఒకసారి ఎన్నికలు ముగిసిన తరువాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉంటాయే తప్ప, బీజేపీ, తెలుగుదేశం ఉండవని వ్యాఖ్యానించారు. తాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెళ్లి, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడానని.. తానేమీ ప్రభుత్వంతో వ్యాపారాలు చేయలేదని, తన తండ్రి ముఖ్యమంత్రి కాదని, విపక్ష నాయకుడి మాదిరిగా వారం వారం కేసుల విచారణకు హాజరు కావడం లేదని అన్నారు.