TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భారత ఆర్మీ చేతికి వందల ఆత్మాహుతి డ్రోన్లు

Published on: Tue Apr 7, 2026 3:52PM

 

ఆధునికి సాంకేతిక యుద్దాల్లో కీలక పాత్ర పోషించ ఆత్మాహుతి డ్రోన్లు భారత్ ఆర్మీ అమ్ములపొదిలో చేరాయి. కామికాజిగా పిలిచే ఈ ఆత్మాహుతి డ్రోన్లు పేలుడు పదార్ధాలను మోసుకెళ్లి, లక్ష్యాన్ని ఢీకొని పేలిపోతాయి. ఇవి గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ, 10 కి.మీ పరిధిలోని శత్రు స్థావరాలను AI సహాయంతో ఖచ్చితంగా ధ్వంసం చేస్తాయి. మైనస్ 35 డిగ్రీల వరకు) మరియు GPS లేని ప్రదేశాల్లో కూడా పని చేసే ఈ డ్రోన్లు సాధారణ క్షిపణుల కంటే చాలా తక్కువ ఖర్చుతో తయారవుతాయి. 

ఈ రకానికి చెందిన వందలాది డ్రోన్లను స్వదేశీ సంస్థ రూ. 10 కోట్ల ఒప్పందంతో తాజాగా సైన్యానికి అప్పగించినట్లు సమాచారం. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గం ఘటన నేపధ్యంలో సరిహద్దుల రక్షణ విషయంలో భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ‘ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ’ అనే సంస్థ వందలాది ఆత్మహుతి డ్రోన్లను ఆర్మీ నార్తర్న్‌ కమాండ్‌కు డెలివరీ చేసినట్లు సమాచారం.