TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పిల్లలతో రైల్లోంచి దూకిన తల్లి

Published on: Thu Dec 24, 2015 10:04AM

 

గుంటూరు జిల్లా నిడుబ్రోలు రైల్వే స్టేషన్లో బుధవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. కదులుతున్న రైల్లోంచి ఒక తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా కిందకి దూకేసింది. ఈ ప్రమాదంలో తల్లి, ఆమె కుమార్తె మరణించారు. మరో బాలుడి పరిస్థితి విషమంగా వుంది. ఆ బాలుడిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఆత్మహత్యా యత్నానికి గల కారణాలు, వీరు ఎవరు అనే విషయాలు వెల్లడి కావలసి వుంది.