వందేళ్లకు సరిపోయే నిల్వలుంటే దిగుమతి ఎందుకు?
Published on: Thu Oct 18, 2012 10:03AM
.png)
మరో వందేళ్లపాటు వినియోగించుకోవటానికి సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్ర బొగ్గుగనుల సహాయ మంత్రి ప్రతీక్ ప్రకాశ్ బాపు పాటిల్ అన్నారు. ఆయన రాష్ట్రంలో కీలకమైన సింగరేణి బొగ్గుగనులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం డిమాండు ఎక్కువగా ఉన్నందున విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటామన్నారు. నిల్వలు ఉన్నప్పుడు దిగుమతి ఎందుకు? డిమాండు ఎంత ఎక్కువ ఉన్నా నిల్వలో కరిగిన విలువకు సరిపడే బొగ్గు సేకరించగలిగితే సరిపోతుంది కదా! అసలు ఎందుకు సింగరేణి పరిశ్రమ ఇతర రాష్ట్రాల్లో బొగ్గు సేకరించేందుకు అనుమతి ఇవ్వలేదో ఆయన చెప్పలేదు. తాజాగా సింగరేణి ధరఖాస్తులను పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఏమైనా బొగ్గు ఉత్పత్తిని పెంచుతామని ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్తు ఉత్పత్తిని కూడా ఈ బొగ్గుద్వారానే పెంచుతామని కూడా మంత్రి స్పష్టం చేశారు. 2009లో బొగ్గుగనుల కేటాయింపుపై విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు.


