ఆమ్ ఆద్మీలో సుధాకర్ హీరో
Published on: Thu Sep 26, 2013 11:58AM

"లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" చిత్రంలో నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న నటుడు సుధాకర్. సుధాకర్ హీరోగా త్వరలోనే మరో చిత్రం ప్రారంభం కానుంది. ఆమ్ ఆద్మీ పిక్చర్స్ బ్యానర్ లో అరుణ్ దాస్యం దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో కార్తీక్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...."ప్రేమ, కుటుంబ కథాంశమిది. లవ్, ఫ్యామిలీ, స్పోర్ట్స్, మ్యూజిక్.. ఈ నాలుగు అంశాల కలయికలో తీర్చిదిద్దనున్నాం" అని అన్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది.


