TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సంక్రాంతికి స‌డెన్‌గా ఈ వ‌ర్షాలేంటి?

Published on: Thu Jan 13, 2022 11:22AM

ఉన్న‌ట్టుండి వాన ప‌డుతోంది. ఏపీ, తెలంగాణ‌లో ప‌లు చోట్ల వ‌ర్షం కురుస్తోంది. తెలంగాణ‌లో చాలా జిల్లాల్లో మూడు రోజులుగా ముసురు ప‌ట్టింది. ఏపీలోనూ అనేక చోట్ల జోరు వాన‌. ఇదేంటి? స‌డెన్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఈ వ‌ర్షాలేంటి? అని అంతా విస్తుపోతున్నారు. సంక్రాంతి సంద‌డి నెల‌కొనే స‌మ‌యంలో.. వేడుక‌లు వాన పాలు అవుతాయా? అని హైరానా ప‌డుతున్నారు. గ‌తంలో ఇలా సంక్రాంతి సీజ‌న్‌లో వ‌ర్షాలు ప‌డిన సంద‌ర్భాలు స్వ‌ల్ప‌మే. అంతా క‌లికాలం అనుకుంటున్నారు.

ప్ర‌స్తుతం కురుస్తున్న వ‌ర్షాల‌కు.. ఉపరితల ద్రోణి ప్రభావమే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షం కురుస్తోంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాన ప‌డుతోంది. క‌ల్లాల్లో ఉన్న పంట వాన‌కు పాడైపోతోందని రైతులు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. రోడ్లపై వాన నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. న‌గ‌రంలో గురువారం ఉదయం నుంచి వ‌ర్షం ప‌డుతుండ‌టంతో.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకు వెళ్లే భక్తులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.  

అటు, వాతావరణ మార్పులతో విజయవాడ నగరమంతా ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రకాశం జిల్లాలోనూ మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.