సుదర్శన్ మృతి ఆరెస్సెస్ కి తీరని లోటు
Published on: Sat Sep 15, 2012 12:22PM
.jpg)

ఆర్ ఎస్ ఎస్ అంటే సుదర్శన్, సుదర్శన్ అంటే ఆర్ ఎస్ ఎస్. ఏళ్లపాటు ఆరెస్సెస్ తో సుదర్శన్ కి అంతగా బంధం బలపడిపోయింది. వాజ్ పేయ్ ప్రథానిగా ఉన్నప్పుడు సుదర్శన్ ఏది చెబితే అది క్షణాల్లా జరిగిపోయేది. నమ్మిన సిద్ధాంతంకోసం ప్రాణం పోయేవరకూ నిలబడ్డ గొప్ప మనిషి సుదర్శన్. కరుడుగట్టిన హిందూ తత్వవాది అనే ముద్ర బలంగా ఉన్నా సుదర్శన్ అతివాది కాదని పార్టీలో చాలామంది చెప్పుకుంటారు. తన తర్వాత మరో పది తరాలవరకూ ఆరెస్సెస్ పై సుదర్శన్ చెరగని ముద్ర వేశారని బీజేపీ సీనియర్ నేతలంతా ఒప్పుకుని తీరాల్సిందే. చాలాకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సుదర్శన్ రాయపూర్ లోని ఆర్ ఎస్ ఎస్ కార్యాలయంలోనే తుది శ్వాస విడిచారు. 1954 నుంచి కుప్పిలి సీతారామయ్య సుదర్శన్ ఆర్ ఎస్ ఎస్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2000 నుంచి 2009 వరకూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2009 మార్చ్ 31న పదవినుంచి వైదొలిగారు.


