పాక్‌లో మరో ఆత్మాహుతి దాడి - 16 మంది మృతి

posted on: Feb 22, 2026 8:46AM

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో శనివారం ఫిబ్రవరి 21)న జరిగిన ఆత్మాహుతి దాడిలో 16 మంది మరణించారు. మృతులలో  ఇద్దరు పాక్ సైనికులు, ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నారు.  మృతులలో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారితో పాటు పౌరులూ ఉన్నట్టు సమాచారం. ఈ పేలుడులో పలువురు సైనికులు గాయపడ్డారు. పాకిస్థాన్ లో పక్షం రోజుల  వ్యవధిలో ఇది మూడో ఆత్మాహుతి దాడి కాగా.. ఐదు రోజుల్లో రెండోది కావడం గమనార్హం.

 ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బన్ను జిల్లా సరార్ దర్గా ప్రాంతంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని పాక్ భద్రతా దళాలు అడ్డుకున్నాయి. దీంతో ఆత్మాహుతి దళ సభ్యుడు సైనిక కాన్వాయ్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.  అయితే.. సైన్యానికి చెందిన వాహనం దాడులను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించినది కావడంతో అది పేలిపోలేదు.

పేలుడు ధాటికి ఓ నిఘా సంబంధిత ఆపరేషన్లో పాల్గొంటున్న కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ షాజాదా గుల్ మృతిచెందినట్టు సమాచారం.  అఫ్గానిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఇటీవలి కాలంలో ఉగ్ర సంఘటనలు పెరిగాయి. కొద్ది రోజుల క్రితం.. తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్(టీటీపీ) బజౌర్ జిల్లాలోని ఓ చెక్‌పాయింట్‌ను పేలుడు పదార్థాలతో కూడిన వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది భద్రతా సిబ్బంది సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...