TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సుబ్రతో రాయ్ కు సుప్రీం వార్నింగ్... మళ్లీ జైలుకెళ్లాల్సి ఉంటుంది.

Published on: Thu Apr 27, 2017 3:48PM

 

సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ కు మరోసారి సుప్రీంకోర్టు చేతిలో అక్షింతలు పడ్డాయి. ఇప్పటికే ఆంబే వ్యాలీలోని రూ.34 వేల కోట్ల విలువైన ఆస్తులను విక్రయించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జూన్‌ 15 నాటికి రూ.2,550 కోట్లు మదుపుదార్లకు చెల్లించకపోతే మళ్లీ జైలుకెళ్లాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. షూరిటీ కింద రూ. 2,500 కోట్లు చెల్లించాలని.. చెక్ బౌన్స్ అయితే కోర్టు నుంచి నేరుగా తీహార్ జైలుకు పంపుతామని వార్నింగ్ ఇచ్చింది. కాగా రాయ్‌కు పెరోల్‌ సహా బెయిల్‌ కోసం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులన్నీ నేటితో ముగియనున్నాయి.