శ్రీదేవిని పథకం ప్రకారమే చంపారు..!
Published on: Tue Feb 27, 2018 12:31PM

ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి శ్రీదేవి మరణంపై కూడా స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి మృతిపై అనుమానాలున్నాయి.. ఫోరెన్సికి రిపోర్ట్ పై కూడా అనుమానాలున్నాయన్నారు. ఆమెది సహజమరణమేనా.. ఇది నిజంగా నమ్మమంటారా..ఈ వార్త చాలా హాస్యాస్పదంగా ఉంది అని అన్నారు. అంతేకాదు... ముందు వైద్యులు గుండెపోటుతో మరణించిందని ఎందుకు ప్రకటించారు.. హోటల్ లోని సీసీ టీవీ ఫూటేజ్ ను పరిశీలిస్తే కానీ... అసలు నిజం తెలియదు... శ్రీదేవితో ఎవరైనా బలవంతంగా మందు తాగించారా..? నా అభిప్రాయం ప్రకారం.. శ్రీదేవిని పథకం ప్రకారమే హత్య చేశారని.. ఎవరో ఆమెకు బలవంతంగా మద్యం తాగించి, స్నానాల తొట్టెలోకి తోసి చంపి ఉంటారనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే శ్రీదేవి మరణానికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ నివేదిక బయటకు వచ్చిన తర్వాతే దీనిపై మరింత స్పందించగలనని ఆయన చెబుతున్నారు.


