మళ్లీ పెద్ద నోట్లపై స్వామి సంచలన వ్యాఖ్యలు...


భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వివాదాస్ప ద వ్యాఖ్యలు చేస్తారన్న సంగతి తెలిసిందే. అలాగే మరోసారి పెద్ద నోట్ల రద్దుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆయన పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కామెంట్లు చేసిన సంగతి విదితమే. ఇప్పుడు ఓ ఆంగ్ల న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ.. దేశంలో అవినీతి, నల్లధనం నిర్మూలనే ధ్యేయంగా నవంబర్‌ 8న ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశంలో నెలకొన్న గందరగోళాన్ని సరిదిద్దకపోతే ప్రజాదరణ అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఆరు నెలల పాటు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందనీ.. ఆ తర్వాత ప్రజాదరణ అంతా ఆమెకు ప్రతికూలంగా మారిందని గుర్తుచేశారు.