నేతాజీ జయంతి.. రహస్య ఫైళ్లను విడుదల చేసిన మోడీ..
Published on: Sat Jan 23, 2016 2:09PM
.jpg)
ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించిన రహస్య ఫైళ్లను ఈరోజు విడుదల చేశారు. సుమారు 100 ప్రతులను ప్రధాని విడుదల చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మోడీ ముందుగా నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నేతాజీ కుటుంబ సభ్యులను పలకరించి వారికి సానుభూతి తెలిపారు. అయితే గత ఏడాది అక్టోబర్ లో నేతాజీ కుటుంబ సభ్యులను కలిసిన ప్రధాని.. నేతాజీకి సంబంధించిన రహస్య ఫైళ్లను విడుదల చేస్తామని వారికి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు రహస్య ఫైళ్లను విడుదల చేశారు. దీంతో ఇప్పుడు నేతాజీ మరణానికి సంబంధించిన అంశాలు కొన్నైనా బయటపడే అవకాశం ఉందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా, ఇటీవలే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతాజీకి సంబంధించిన 64 రహస్య పత్రాలను బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే.


