మంత్రి శైలజానాథ్‌పై జేసీ విజయం
Published on: Sat Dec 31, 2011 12:50PM
అ
నంతపురం: సుబ్బరాయసాగర్ నీటి విడుదల విషయంలో అనంతపురం జిల్లా తాడిపత్రి కాంగ్రెసు శాసనసభ్యుడు మంత్రి శైలజానాథ్‌పై విజయం సాధించారు. సుబ్బరాయసాగర్ నుంచి తాడిపత్రి కాలువకు ఆయన నీటిని విడుదల చేయించారు. అధికారులు తాడిపత్రి కాలువకు నీరు విడుదల చేశారు. తాడిపత్రి కాలువకు నీటి విడుదల విషయంలో జిల్లా మంత్రి శైలజానాథ్‌కు, జెసి దివాకర్ రెడ్డికి మధ్య వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. సుబ్బరాయసాగర్ నీటి వివాదం ఇటీవల మంగళవారం కాస్త ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. సుబ్బరాయసాగర్ నీటి విడుదల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి, జిల్లా సీనియర్ కాంగ్రెసు నేత జెసి దివాకర్ రెడ్డి మంగళవారం స్వయంగా తన కార్యకర్తలతో వెళ్లి తాడిపత్రి రెండో ఆయకట్టుపై ఉన్న ఇసుక బస్తాలను తొలగింప జేశారు. ప్రస్తుతం అధికారికంగా జెసి దివాకర్ రెడ్డి తాడిపత్రి కాలువకు సుబ్బరాయసాగర్ నుంచి నీటిని విడుదల చేయించారు.


