వైసీపీ నేతలకు గుప్తా ఇక ‘దబిడి దిబిడే’!
Published on: Fri Feb 4, 2022 10:57AM
ఎవర్ని గెలికితే.. రచ్చ రచ్చ అవుతుందో.. ఎవర్ని తాకితే.. ఆగమాగం అవుతుందో.. సరిగ్గా అతనినే గెలికారు వైసీపీ నేతలు. తనను గెలికినప్పటి నుంచీ వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నాడు సుబ్బారావు గుప్తా. నిన్న మొన్నటి దాకా రాష్ట్రంలో రచ్చ రచ్చ చేశాడు. దాంతో మాత్రమే సుబ్బారావు కోపం చల్లారలేదు. ఇప్పుడు ఏకంగా దేశ రాజధాని ఢిల్లీ చేరి పంచాయితీ పెట్టాడు. వైసీపీ నేతలకు పట్టపగలే చుక్కలు చూపించే పనిలో పడ్డాడు సుబ్బారావు గుప్తా. ఏపీలో చేసిన రచ్చను మరింతగా కొనసాగించేందుకు ఢిల్లీలో పంచాయితీ మొదలెట్టాడు.
ఆంధ్రప్రదేశ్ లో సుబ్బారావు గుప్తా పేరు తెలియని వారు ఉండరేమో. గుప్తా ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ నేత. సుబ్బారావు గుప్తా అంతలా ఎందుకు పాపులర్ అయ్యాడు అంటే... కారణం వైసీపీ నేతలే అని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినప్పటి నుండీ వైసీపీని ఎవరైనా ప్రశ్నిస్తే వారిని పచ్చడి పచ్చడి చేస్తూ వచ్చారు వైసీపీ నేతలు. అయితే.. వైసీపీవారు చేసే తప్పలను ఎత్తి చూపాడు అదే పార్టీకి చెందిన సుబ్బారావు గుప్తా. ఇక ఏముంది ఆనవాయితీ ప్రకారం మనోడికి బడితపూజ, దేహశుద్ధి చేసేశారు వైసీపీ నేతలు.
అప్పటి నుండి సుబ్బారావు వైసీపీ నేతలను తూర్పార పడుతూనే ఉన్నాడు. ఆర్య వైశ్య సామాజికవర్గ నేతలను ఒక్కటి చేశాడు. ప్రెస్ మీట్ ల మీద ప్రెస్ మీట్లు పెట్టి దుమ్ము దులిపేశాడు. అయినా తనపై దాడి చేసిన నేతలను అరెస్టు చేయకపోవడంతో ఇప్పుడు ఢిల్లీ బాట పట్టాడు. తాజాగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేశాడు. దీంతో ఒక్కసారిగా వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. గుప్తా దీక్ష సోషల్ మీడిలో బాగా చక్కర్లు కొడుతోంది. అది చూసిన నెటిజన్లు గుప్తా చేతిలో వైసీపీ నేతలకు ఇక దబిడి...దిబిడే అంటే తెగ చర్చించుకుంటున్నారు.
గుప్తా ఢిల్లీ టూర్ వెనుక అసలు రహస్యం చాలా మందికి తెలియకపోవచ్చు… సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సుబ్బారావు గుప్తా సామాజికవర్గం అమని. అదితెలిసిన వైసీపీ నేతలు ఏమవుతుందో ఏమో అని తీవ్రంగా కలవరపడుతున్నారట. ఎవర్ని పడితే వారిని గెలికితే ఇదిగో ఇలాంటి పరిణామాలే ఉంటాయి మరి! చూద్దాం గుప్తా గోల ముందు ముందు ఏ స్థాయికి వెళుతుందో వేచి చూద్దాం.!


