TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పుష్పకు సెలవు కావాలి.. స్టూడెంట్స్ లెటర్ వైరల్

Published on: Mon Dec 20, 2021 10:52AM

విద్యార్థులు మరీ బరి తెగిస్తున్నారు. చిల్లర చేష్టలతో విసుగు తెప్పిస్తున్నారు.  ఒకప్పుడు టీచర్‌ను అడగాలంటేనే విద్యార్థులు భయపడిపోయేవారు. కానీ ఇప్పుడు విద్యార్థుల టైం మారింది.. టైమింగూ మారింది. సినిమా కోసం సెలవు కావాలంటూ  ఏకంగా ప్రిన్సిపల్‌కే లేఖ రాసేస్తున్నారు.

పుష్ప సినిమా కోసం కాలేజ్‌కి సెల‌వు ఇవ్వాలంటూ ఏకంగా హెచ్‌వోడీకే లెట‌ర్ రాశారు ఓ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్‌. ఈ నెల 17న ‘పుష్ప’ సినిమా రిలీజ్‌ అవ్వగా.. దానికి ముందు రోజు ఓ ప్రైవేట్‌ కళాశాల విద్యార్థులు లేఖ రాశారు. మరుసటి రోజు కాలేజీకి సెలవు ప్రకటించాలని కోరారు. సెలవు ఇవ్వకపోయినా తాము రాకపోవడం మాత్రం పక్కా అని లేఖ‌లో క‌న్ఫామ్ చేశారు. తాము క్లాసుల‌కి అటెండ్ కాక‌పోతే.. ఇంటికి మెసేజ్‌లు పంపొద్దని, కాల్స్‌ చేయొద్దని ప్రిన్సిపల్‌కు లెట‌ర్ రాశారు. సెలవు ఇవ్వాలంటూ కోరుతూనే.. లేఖ‌ చివర్లో ‘తగ్గేదేలే’ అంటూ ప‌రోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ప‌నిలో ప‌నిగా హెచ్‌వోడీ /ప్రిన్సిపల్‌కు ఓ బంపర్‌ ఆఫర్ కూడా ఇచ్చారు. తమ ద‌గ్గ‌ర ఇంకో ఎక్స్‌ట్రా టికెట్‌ ఉందని, కావాలంటే మీరు కూడా సినిమాకు రావొచ్చంటూ ఇన్‌వైట్ చేశారు ఆ స్టూడెంట్స్‌. 

హైద‌రాబాద్ ఘ‌ట్‌కేస‌ర్‌లోని వీబీఐటీ కాలేజ్ సెకండ్ ఇయ‌ర్ స్టూడెంట్స్‌, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో ఉన్న ఈ లెట‌ర్ సోష‌ల్ మీడియాలో మూడు రోజులుగా ఫుల్ వైర‌ల్ అవుతోంది. పేర్లు లేకుండా లెట‌ర్ రాయ‌డం.. లెట‌ర్ చివ‌ర‌న‌.. నీ అవ్వ త‌గ్గేదే లే.. అంటూ రాయ‌డం.. లెట‌ర్ రాసింది హెచ్‌వోడీ కా? ప్రిన్సిప‌ల్‌కా అనే క్లారిటీ లేకుండా రాయ‌డం.. త‌మ ఇంఛార్జ్ మేడ‌మా? సారా? అనే స్ప‌ష్ట‌త కూడా లేకుండా లేఖ రాయ‌డం.. ఇవ‌న్నీ చూస్తుంటే.. పుష్ప రిలీజ్ సంద‌ర్భంగా కావాల‌నే ఈ లెట‌ర్ క్రియేట్ చేసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశార‌ని అంటున్నారు. వాళ్ల ప్లాన్ బాగానే వ‌ర్క‌వుట్ అయిన‌ట్టుంది.. కామెంట్లూ, లైకులూ బాగానే వ‌స్తున్నాయి.