పిల్లల బ్యాగ్‌ బరువు తగ్గించండి- జడ్జీకి లేఖ

 

కేరళకు చెందిన ‘ముఖేష్ జైన్’ రోజూ పిల్లల బ్యాగ్‌లను చూసీచూసీ అలసిపోయాడు. దాదాపు 20 కిలోలదాకా ఉండే ఆ బ్యాగ్‌లను మోసే పిల్లలని చూసి తెగ బాధపడిపోయాడు. దాంతో ఏకంగా సుప్రీం కోర్టు జస్టిస్ మిశ్రాకు ఓ లేఖ రాశాడు. సిలబస్ మార్చకుండానే రెండు మూడు భాగాలుగా పాఠ్య పుస్తకాలను ముద్రించేలా చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేయమని కోరాడు. కోర్టు జైన్‌ అభ్యర్థనను విచారణలోకి కూడా తీసుకుంది. మరి ఆ విచారణ తర్వాత ఎలాంటి ఉత్తర్వులు వెలువడతాయో, వాటి వల్ల పిల్లలకు ఏదన్నా ఉపయోగం ఉంటుందో లేదో త్వరలోనే తేలిపోతుంది.