లంక గ్రామాలకు విద్య ప్రాణసంకటమేనా?

నేటి బాలలే రేపటి పౌరులు అంటారు.అలాంటి పిల్లలు విద్య కోసం నిత్యం ప్రాణసంకటంగా ప్రయాణం చేయవలిసిన దుస్థితి లంక గ్రామల్లో నెలకొంటోంది. ఎంతో ప్రశాంతంగా ఉండే గోదావరి  ప్రయాణంతో ఆహ్లాదంగా  పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, కానీ విధి ఆ పిల్లల జీవితాలను హరించుకుపోయింది.ఈ నెల 14 న అనుకోని సంఘటన గోదావరిలో పడవ బోల్తా పడటంతో విద్యార్థులు గల్లంతయ్యారు.వీరంతా పశువుల్లంక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యని అభ్యసిస్తున్నవారు.

 

 

 

26 మంది ఆ గ్రామానికి చెందినవారు కాగా అందులో 11 మంది బాలురు, 15 మంది బాలికలున్నారు. వీరిలో ఆరుగురు విద్యార్థినులు గల్లంతవ్వటంతో తోటి విద్యార్థులు, వారి తల్లి తండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇందులో సోమవారం సాయంత్రం 5.30  గంటలకు మత్యకారులకు భైరవపాలెం మొగ వద్ద ఒకరి మృతదేహం లభ్యమవ్వగా ఇంకా ఐదుగురి ఆచూకీ లభించలేదు. యంత్రాంగం రేయంబవుళ్లు యుద్దప్రాతిపదికన గాలింపు చర్యలు చేపడుతున్నా ఫలితం కనిపించట్లేదు.