కొనసాగుతున్న సమ్మె సైరన్
Published on: Tue Feb 28, 2012 9:02AM
న్యూఢిల్
లీ : యూపీఏ సర్కారు ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా దాదాపు 11 కోట్ల మంది కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. సమ్మె కారణంగా వామపక్ష పార్టీ కార్యకర్తలు, కార్మిక సంఘాల నేతలు బస్సులను అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలోనూ కోటిన్నరకు పైగా కార్మికులు సమ్మెలో భాగస్వాములయ్యారు. సమ్మె దెబ్బకు సర్కారీ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. ప్రైవేటు బ్యాంకులన్నీ యథావిధిగా పని చేయనున్నందున బ్యాంకింగ్ సేవలు పాక్షికంగా కొనసాగే అవకాశముంది. ఇవాళ జరగాల్సిన కొన్ని పరీక్షల్ని సైతం కేంద్రం వాయిదా వేసింది. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ప్రభావం రైల్వే కార్యకలాపాలపై పడకుండా అధికార యంత్రాంగం వివిధ జాగ్రత్తలు చేట్టింది. దీంతో అన్ని రైళ్ళ రాకపోకలు యధాతధంగా సాగుతున్నాయి. రైల్వేస్టేషన్లలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.


