TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమ్మఒడి అంత ఈజీ కాద‌మ్మా.. స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిన జ‌గ‌న‌న్న..

Published on: Tue Oct 12, 2021 11:26AM

అమ్మఒడి. విద్యార్థుల‌కు ఆర్థిక ఒడి. ప్రైవేట్‌, గ‌వ‌ర్న‌మెంట్ అనే తేడా లేకుండా.. స్కూల్‌కు వెళ్లే ప్ర‌తీ స్టూడెంట్‌కు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తుంది ప్ర‌భుత్వం. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది.. కానీ, అమ‌లులోనే అనేక కొర్రీలు పెడుతోంది. ప్ర‌తీ స్టూడెంట్‌కు అమ్మఒడి రాదు.. కండీష‌న్స్ అప్లై అంటోంది. ఆ అర్హ‌త‌లు ఉన్న‌వారికే అమ్మఒడి ఇస్తామంటూ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేసింది. తాజాగా, ఈ ఏడాది నుంచి అమ్మఒడి పథకాన్ని విద్యార్థుల హాజరుతో అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జ‌గ‌న్‌. 75 శాతం హాజ‌రు త‌ప్ప‌కుండా ఉంటేనే అమ్మఒడి వ‌ర్తిస్తుంది. లేదంటే.. ఆర్థిక సాయం బంద్‌. 

ఇక‌, అమ్మఒడి పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఇక నుంచి విద్యాసంవత్సరం ప్రారంభంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు విద్యా సంవత్సరం మధ్యలో ఇస్తున్నారు. అయితే, ప్రస్తుత విద్యాసంవత్సరానికి (2021-22) యథావిధిగా వచ్చే జనవరిలోనే ఇస్తారా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. 

మ‌రోవైపు, ఉపాధ్యాయుల మ్యాపింగ్‌పైనా ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా దృష్టిపెట్టింది. ఈ విధానాన్ని టీచ‌ర్లు వ్య‌తిరేకిస్తున్నా.. దూకుడుగా ముందుకు పోతోంది. ఈ నెలాఖరు నాటికి మ్యాపింగ్‌ పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. 

తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్న‌ ఎయిడెడ్‌ పాఠశాలల విలీనంపైనా త‌గ్గేదే లేదంటోంది ప్ర‌భుత్వం. ప్రభుత్వానికి అప్పగిస్తే నడుపుతామని, లేదంటే వారే ప్రైవేటుగా నడుపుకోవచ్చని బ‌య‌ట‌కు చెబుతున్నా.. లోలోన మాత్రం ఎయిడెడ్ స్కూల్స్‌ను విలీనం చేయాల్సిందేనంటూ స‌ర్కారు తీవ్ర ఒత్తిడి చేస్తోంద‌ని అంటున్నారు.