TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహిళల భద్రత కోసం స్త్రీ రైడ్

Published on: Sat Jun 6, 2026 3:07PM

హైదరాబాద్‌లో మహిళల భద్రతను మరింత బలో పేతం చేయడమే లక్ష్యంగా  స్త్రీ రైడ్  కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.నగరంలో మహిళలకు సురక్షితమైన, నమ్మకమైన రవాణా సేవ లను అందించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసు కొచ్చినట్లు ఆయన పేర్కొ న్నారు. ప్రారంభ దశలో 55 టూ-వీలర్ రైడ్స్‌తో పాటు 4 ఆటో రైడ్స్‌ను అందుబాటు లోకి తీసుకువచ్చామని తెలిపారు. సాధారణంగా డెలివరీ, క్యాబ్ రంగాల్లో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తుందని, అయితే ఇప్పుడు మహి ళలు కూడా రైడ్ సేవల్లో ముందుకు రావడం ఒక సానుకూల మార్పుగా ఆయన అభివర్ణించారు.

మహిళలు డ్రైవింగ్ రంగం లోకి రావాలంటే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారం ఎంతో కీలకమన్న ఆయన . గత కొంతకాలంగా సరైన మద్దతు లేకపోవడంతో కొంతమంది మహిళలు క్యాబ్ సేవల నుంచి దూర మయ్యారన్నారు. అలాగే..  మహిళా రైడర్లుగా నియమితులైన వారు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని   సూచించారు. రాబోయే రోజుల్లో ఈ  స్త్రీ రైడ్  కార్యక్రమాన్ని మరింత విస్తరించి మహిళా రైడర్ల సంఖ్యను పెంచేలా కృషి చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర డిజిపి సి.వి ఆనంద్ తెలిపారు.