ఆగ్రహించిన "హాట్ ఎమ్మెల్యే"
Published on: Tue May 24, 2016 3:28PM

తనపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హాట్ ఎమ్మెల్యే పోస్ట్‌ల పట్ల అస్సామీ నటి, బీజేపీ ఎమ్మెల్యే అంగూర్ లతా డేకా ఖండించారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీయే కారణమన్నారు. ఒక సెలబ్రిటీగా సమాజంలో మార్పు తీసుకురావడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను అందంగా కనిపించడం దేవుడిచ్చిన వరమన్నారు. మార్స్‌పై అడుగుపెట్టినా మనుషుల మనస్తత్వాలు మారలేదు అనడానికి ఇలాంటి సంఘటనలే నిదర్శమన్నారు. ఇక ఇలాంటి వివాదాలు ఎన్ని వచ్చినా తాను పట్టించుకోనుని తెలిపారు.


