వాట్సాప్ లో ఆ 10 త‌ప్పులు చేయ‌కండి!

తెలిసో, తెలియకో వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘిస్తే మీ వాట్సాప్ ఖాతా పూర్తిగా పోవడంతో పాటు మీ మీద చట్టపరమైన చర్యలు త‌ప్ప‌వ‌ట‌. అందుకే మీరు వాట్సాప్ ఉపయోగిస్తుంటే ఆ 10 త‌ప్పులు చేయ‌కుండా జాగ్ర‌త్త ప‌డండి!

1. బెదిరింపు, ద్వేషాన్ని పెంచేలా మెసేజ్ లు పెట్ట రాదు!

ఎవ‌రి మ‌నోభావాల‌ను, వారి పేరుప్ర‌తిష్ట‌ల‌ను దెబ్బతీసే విధంగా మెసేజ్ లను పంపకూడదు. అలాగే బెదిరింపు మెసేజ్ లు, ద్వేషాన్ని పెంచేలా ఉన్న మెసేజ్ లు, ఒకరిని వేధించే విధంగా మెసేజ్ లు పంపడం కూడా వాట్సాప్ నియమ, నిబంధనలకు విరుద్ధం. అవతలి వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ పై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

​2. నేరాలను ప్రేరేపించే ఫొటోలు, మెసేజ్ పంప‌రాదు.

నేరాలను ప్రేరేపించే విధంగా ఉన్న ఫొటోలు కానీ, వాటికి సంబంధించిన వీడియోలు కానీ సాధారణ సందేశాలు కూడా కావచ్చు. ఈ విధమైన మెసేజ్ లను పంపించడం వాట్సాప్ నిబంధనలకు విరుద్ధం. మీరు తెలియక పంపిన ఇబ్బందులు త‌ప్ప‌వు.

​3. సరదాకు కూడా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయవ‌ద్దు

సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సహజమే. అలాగే వాట్సాప్ లో కూడా ఫేక్ అకౌంట్లు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఫేక్ అకౌంట్ సృష్టించారన్న విషయం వాట్సాప్ దృష్టికి వెళ్తే ఆ ఖాతాను వాట్సాప్ పూర్తిగా బ్యాన్ చేస్తుంది.

​4. కాంటాక్ట్ లిస్ట్ లో లేని వారికి మెసేజ్ లు పంపరాదు!

మీ కాంటాక్ట్ లిస్ట్ లో లేని వారికి ఎక్కువ మెసేజ్ లు పంపకూడదు. బల్క్ మెసేజింగ్, ఆటో మెసేజింగ్, ఆటో డయలింగ్ వంటి వాటిని అస్సలు చేయకూడదు. అటువంటి తప్పులు చేసినప్పటికీ మీ వాట్సాప్ ఖాతా బ్యాన్ అవుతుంది.

​5. వాట్సాప్ యాప్ కోడ్ ని మార్చకూడదు!

కొంతమంది వాట్సాప్ యాప్ కోడ్ ను మార్చాలని చూస్తూ ఉంటారు. వాట్సాప్ కోడ్ ను రివర్స్ ఇంజనీర్, కోడ్ ను మార్చాలని చూడటం, వారి సేవలకు సంబంధించిన కోడ్ ను ఎక్స్ ట్రాక్ట్ చేయడం కూడా నిబంధనలకు విరుద్ధమే. అటువంటి పనులు చేసినప్పటికీ మీ వాట్సాప్ ఖాతా బ్యాన్ లేదా సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది.

​6. మాల్ వేర్ తో కూడుకున్న మెసేజ్ లను ఫార్వర్డ్ చేయకండి

కొంతమంది వాట్సాప్ ద్వారా మాల్ వేర్ ను పంపిస్తూ ఉంటారు. వాట్సప్ లో పంపించే ఫొటోలు, జిఫ్ లు, వీడియోల ద్వారా కొంతమంది మాల్ వేర్ మెసేజ్ లను పంపిస్తూ ఉంటారు. ఇలా మాల్ వేర్ ను పంపించడం చట్టబద్ధంగా కూడా విరుద్ధమే. కాబట్టి సరదాగా కూడా ఇటువంటి మాల్ వేర్ తో కూడుకున్న మెసేజ్ లను ఎవ్వరికీ ఫార్వర్డ్ చేయకండి.

​7. వాట్సాప్ ఖాతాను వాట్సాప్ సర్వర్ల ను హ్యాక్ చేయడం

మీ వాట్సాప్ ఖాతా ద్వారా వేరే వారి వాట్సాప్ ఖాతాను హ్యాక్ చేయడానికి ప్రయత్నించడం, అలాగే వాట్సాప్ సర్వర్లను కూడా హ్యాక్ చేయకూడదు. మిగతా వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించాలని ప్రయత్నించడం చట్టపరంగా కూడా నేరమే. అలా చేస్తే వాట్సాప్ నుంచి బ్యాన్ చేయడమే కాకుండా జైలుకు వెళ్లేలా కూడా చేస్తుంది.

​8. వాట్సాప్ ప్లస్ ను ఉప‌యోగించ‌డానికి అనుమతి లేదు.

వాట్సాప్ ప్లస్ అనే థర్డ్ పార్టీ యాప్ ను ఉపయోగించడం కూడా మీరు వాట్సాప్ లో బ్యాన్ అయ్యేలా చేస్తుంది. వాట్సాప్ ప్లస్ యాప్ ను వాట్సాప్ రూపొందించలేదు. అంతేకాకుండా దాన్ని ఉపయోగించడానికి అనుమతి కూడా ఇవ్వలేదు. వాట్సాప్ ప్లస్ యాప్ డెవలపర్లకు వాట్సాప్ కు ఎటువంటి సంబంధం లేదు.

​9. ఎక్కువ మంది బ్లాక్ చేసినా ప్రమాదమే!

తెలియని వారితో చాట్ చేయాలని ప్రయత్నించి మీ వాట్సాప్ ఖాతాను పోగొట్టుకోకండి. వాట్సాప్ ఖాతాను దుర్వినియోగం చేయకండి. ఒకవేళ మిమ్మల్ని ఎక్కువ మంది యూజర్లు బ్లాక్ చేసినా మీరు వాట్సాప్ లో సస్పెండ్ అయ్యే ప్రమాదం ఉంది.

​10. రిపోర్ట్ చేయకుండా చూసుకోండి!

మీ ఖాతా నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిస్తే ఎవరైనా సరే మీ ఖాతాను రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. అలా రిపోర్ట్ వచ్చిన ఖాతాలపై ఆయా సోషల్ మీడియా సంస్థలు తనిఖీ చేస్తాయి. నిజంగా నిబంధనలను అతిక్రమించినట్లు తెలిస్తే ఆ ఖాతాను సస్పెండ్ చేస్తారు.