ఆడాళ్ళ కడుపుల్లో రాళ్ళ ఫ్యాక్టరీలు!

posted on: May 23, 2024 10:40AM

పెద్దలు సాధారణంగా నాలుగు రాళ్ళు వెనకేసుకోమంటారు. కానీ చాలామంది కడుపులో రాళ్ళు పెంచుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం అమలాపురంలోని ఓ ఆస్పత్రిలో నరసవేణి అనే మహిళ కడుపు నొప్పితో బాధపడుతోందని ఆపరేషన్ చేశారు. ఆమె కడుపులోంచి మొత్తం 570 రాళ్ళు బయటకి తీశారు. కడుపుల్లో ఇన్ని వందల రాళ్ళా అనే షాక్ నుంచి అందరూ కోలుకునేలోపే మరో మహిళ ఇంకో షాక్ ఇచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన ఒక మహిళకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు మొత్తం 77 రాళ్ళు బయటకి తీశారు. రాళ్ళు బయటకి తీసిన తర్వాత ఈ ఇద్దరు మహిళలూ ఆరోగ్యంగా వున్నారు. సంతోషం.

google-ad-img
    Related Sigment News
    • Loading...