వణుకుతున్న స్టాక్ మార్కెట్లు
Published on: Tue Jul 23, 2024 12:05PM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ సమర్పిస్తున్న నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్లు ఒదిదుడుకులకు లోనవుతున్నాయి. మంగళవారం ఉదయం 11:55 గంటలకు సెన్సెన్స్ 172 పాయింట్లు నష్టపోయి 80,329 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 56 పాయింట్లు కుంగి 24,452 దగ్గర ట్రేడవుతోంది.


