ఆల్ టైం రికార్డును తాకిన స్టాక్ మార్కెట్లు..
Published on: Tue Mar 14, 2017 1:20PM
.jpg)
ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో భాజపా అఖండ విజయం సాధించడం మార్కెట్లలో జోష్ నింపుతుందని నిపుణులు భావించారు. అనుకున్నట్లే నేటి ఉదయం మార్కెట్లు రికార్డు స్థాయిని అందుకున్నాయి. ఇప్పటి వరకు ఉన్న రాజకీయ అనిశ్చితి ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా మాయమైంది. సాధారణంగా ప్రభుత్వ నిర్ణయాలను రాజకీయాలు ప్రభావితం చేస్తాయి. ఇది మార్కెట్లపై ప్రభావం చూపుతుంది. దీంతో నేటి సెషన్లో నిఫ్టీ 50 సూచిక ఆల్ టైం రికార్డును తాకింది. ఓ దశలో 9,122.75 పాయింట్లను తాకిన నిఫ్టీ మధ్యాహ్న సమయంలో 9,078 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచికకు 52 వారాల గరిష్ఠస్థాయి 8,992 పాయింట్లు కాగా, కనిష్ఠస్థాయి 7,516 పాయింట్లు.


