స్టాక్ మార్కెట్‌కి పూనకం
Published on: Mon Jun 30, 2014 4:38PM

శుక్రవారం వరకు దేవుడా అన్నట్టుగా డల్లుగా నడిచిన భారతీయ స్టాక్ మార్కెట్ సోమవారం నాడు మాత్రం పూనకం వచ్చినట్టు ఊగిపోయి లాభాల బాటలో దూసుకుపోయింది. బిఎస్ఇ సెన్సెక్స్ 314 పాయింట్ల లాభంతో 25,413 పాయింట్ల దగ్గర సెటిలయింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 102 పాయింట్లు లాభపడి 7,611 పాయింట్లకి చేరుకుంది. అయితే డాలర్‌తో రూపాయి మారకం విలువ మాత్రం 60.14 దగ్గర ఏడుస్తోంది.


