డీలా పడిన స్టాక్ మార్కెట్లు..

 

ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ లో ఉగ్రదాడి నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నిన్నడీలా పడిపోయాయి. స్టాక్ మార్కెట్లు నిన్న నష్టాల్లోనే ముగిశాయి.  ఈరోజు కూడా దాని ప్రభాపం అలానే ఉంది. ఇంగ్లాండ్‌లో ఉగ్రదాడి.. సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం వల్ల ఈరోజు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 64 పాయింట్లు కోల్పోయి 30,302 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి9,351 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో టాటామోటార్స్‌, టాటామోటార్‌(డీ), అదానీపోర్ట్స్‌, గెయిల్‌, భారత్‌పెట్రోలియం షేర్లు లాభపడగా.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఎల్‌అండ్‌టీ, అరబిందో ఫార్మా, హిందాల్కో షేర్లు నష్టపోయాయి.