నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...


గత నాలుగు రోజుల నుండి మంచి లాభాలతో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లకు బ్రేక్ పడింది. ఈరోజు నష్టాలతోనే ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. నష్టాలతోనే ముగిశాయి. నిఫ్టీ 96 పాయింట్లు నష్టపోయి 9,429 వద్ద .. సెన్సెక్స్‌ 223 పాయింట్లు నష్టపోయి 30,434 వద్ద ముగిసింది. టీసీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, లుపిన్‌, సన్‌ఫర్మాలు లాభపడగా.. బాష్‌, యస్‌బ్యాంక్‌ గ్రాసిమ్‌, అల్ట్రాటెక్‌, భారతీ ఎయిర్‌టెల్‌లు నష్టపోయాయి.