ఈరోజు కూడా నష్టాలనే చవిచూసిన స్టాక్ మార్కెట్లు...
Published on: Wed Mar 22, 2017 5:30PM
.jpg)
గత మూడు రోజులుగా స్టాక్ మార్కెట్లు నష్టాలనే చవిచూస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలనే చవిచూశాయి. అంతర్జాతీయంగా సరైన మద్దతు లభించకపోవడం, అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు ఈ రోజు భారీగా పతనమయ్యాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ ఏకంగా 318 పాయింట్లు నష్టపోయి 29,168కి పడిపోయింది. నిఫ్టీ 91 పాయింట్లు కోల్పోయి 9,030కు చేరింది.


