Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హీరోయిన్‌గా స్టీవ్ జాబ్స్ కూతురు
posted on: Nov 25, 2014 9:56AM

సాఫ్ట్‌వేర్ దిగ్గజం, యాపిల్ ఉత్పత్తుల సృష్టికర్తల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ ఇటీవల క్యాన్సర్ వ్యాధితో మరణించిన విషయం తెలిసిందే. స్టీవ్ జాబ్స్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్న ఓ సినిమాలో స్టీవ్ జాబ్స్ కూతురు లిసా బ్రెన్నన్ హీరోయిన్‌గా నటించబోతోంది. ఈ విషయాన్ని ఆ సినిమా దర్శకుడు ఆరోన్ సొర్కిన్ తెలిపారు. ఈ సినిమాని ప్రఖ్యాత సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా అంతా స్టీవ్ జాబ్స్ కూతురి పాత్రలో నటించబోతున్న లిసా చెబుతున్నట్టుగా వుంటుంది. లిసా దృక్కోణంలో ఈ సినిమా అంతా వుంటుంది. తన తండ్రి గురించి తాను చెబుతున్నట్టుగా సినిమా కథనం వుంటుందని తెలుస్తోంది. లిసా బ్రెన్నన్ ప్రస్తుతం రచయిత్రిగా కెరీర్ కొనసాగిస్తోంది. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ మీద తీస్తున్న సినిమాలో తన పాత్రలో తానే కనిపించబోతోంది.






