TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రమాదాలకు నిలయంగా మారిన విశాఖస్టీల్‌ప్లాంట్‌

Published on: Tue Jul 3, 2012 12:18PM

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరో ప్రమాద సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన భారీప్రమాదం మరువకముందే రెండోసారి ప్రమాదం ఎదురవటం కార్మిక సంఘాలను కలిచివేస్తున్నాయి. తాజాగా జరిగిన ప్రమాదం కారణంగా తీవ్రఅస్వస్థతకు గురైన ఆరుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ధృవీకరించారు. స్టీలుప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌`1 పంప్‌హౌజ్‌ వద్ద మరమ్మత్తులు నిర్వహిస్తుండగా గ్యాస్‌ లీకయింది. దీంతో అక్కడే పని చేస్తున్న ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించగా విషవాయువుని పీల్చినందున ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వివరించారు. తాము చికిత్స ద్వారా వారు త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వారు స్పష్టం చేశారు. అయితే ఫ్యాక్టరీలో తరుచూ ప్రమాదాలు ఒకదాని తరువాత మరొకటి ఎలా జరుగుతోంది? అసలు నాణ్యతాప్రమాణాలు, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? ఒకవేళ పాటిస్తే కార్మికులు ఎందుకు అస్వస్థతకు గురవుతున్నారని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తరుచుగా ప్రమాదాలు జరిగేటప్పుడు యాజమాన్యం అప్రమత్తం అవ్వాల్సిన అవసరాన్ని గుర్తించాలని కార్మికులు కోరుతున్నారు. వీలైనంత త్వరలో ఈ మేరకు చర్యలు  తీసుకోవాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అలానే అస్వస్థులైన ఆరుగురు కార్మికకుటుంబాలని ఆదుకోవాలని డిమాండు చేశారు.