నిలకడగా అద్వానీ ఆరోగ్యం
Published on: Sun Dec 15, 2024 2:00PM
భారత మాజీ ఉపప్రధాని ఎల్ కె అద్వానీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. రెండు రోజులక్రితం అద్వానీ అస్వస్థతకు గురై ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 97 ఏళ్ల అద్వానీ ఈ యేడాది ఆగస్టులో తీవ్ర అస్వస్థతకు గురై కొన్ని రోజులు చికిత్స తీసుకున్న తర్వాత కోలుకున్నారు. అవిభక్త భారత్ లోని కరాచీలో పుట్టిన అద్వానీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రామమందిర ప్రారంభోత్సవం సందర్బంగా ఆహ్వానం అందినప్పటికీ వయసు రీత్యా ఆయన హాజరుకాలేకపోయారు వరుసగా మూడు పర్యాయాలు ప్రధాని పదవి అధిరోహించిన మోడీ స్వయంగా అద్వానీ నివాసానికి వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు.


