TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రూ. కోట్లతో పాటు కార్లు కూడా కానుకలుగా పొందిన

Published on: Fri Apr 6, 2012 10:45AM

రాష్ట్రమంత్రి శైలజానాథ్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. 2009 ఎన్నికల్లో గెలిచిన ఆయన మంత్రిగా పదవి చేపట్టిన వెంటనే కోట్లాది రూపాయలు ఆర్జించారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మంత్రిగారికి లంచాలరూపంలో కోట్లాది రూపాయలు నగదుతోపాటు విలువైన కార్లను కూడా పొందడం హాబీగా మారిందని వారంటున్నారు. మాజీ మంత్రి తెలుగుదేశంపార్టీ సింగనమల నియోజకవర్గ ఇన్ చార్జీ శమంతకమణి తదితరులు శైలజానాథ్ అవినీతి వ్యవహారాలపై ఒక బుక్ లెట్ ను ముద్రించి పంపిణీ చేస్తున్నారు. 2009 ఎన్నికల అఫిడవిట్ లో ఆయన పేర్కొన్న ఆస్తులకు నేడు అనేక వందల రెట్లు పైగా ఆస్తులు శైలజానాథ్ ఆర్జించారని ఆమె ఆరోపించారు. మద్యం సిండికేట్ల నుంచి కోట్లాది రూపాయలు దండుకోవడమే కాకుండా లేటెస్ట్ మోడల్ కార్లను కూడా బహుమతిగా తీసుకున్నాడని, అనంతపురం చెరువు సమీపంలోని బైపాస్ రోడ్డు నిర్మాణంలో డబ్బుతోపాటు కారు కూడా తీసుకున్నాడని ఆమె ఆరోపిస్తున్నారు. మంత్రిపదవిని అడ్డుపెట్టుకుని నార్పల, బండపల్లి, గార్లదిన్నె, దయ్యాల కొండపల్లి ప్రాంతాల్లో వందలాది ఎకరాల భూములను బినామీ పేర్లతో కొనుగోలు చేశారని, అనంతపురం, బెంగుళూరులో విలువైన ఆస్తులు కొనుగోలు చేశారని ఆమె ఆరిపిస్తున్నారు. చివరకు పేద విద్యార్థులకు అందించే ఉచిత యూనిఫామ్ సరఫరాలో మంత్రి శైలజానాథ్ పర్సంటేజీల కోసం కక్కుర్తిపడి నాణ్యతలేని దుస్తులు విద్యార్థులకు దక్కేలా చేశారని ఆమె మండిపడ్డారు. శైలజానాథ్ ను ఆమె అనంతపురం మధుకోడాగా అభివర్ణిస్తూ ఊరూ వాడా ప్రచారం చేస్తున్నారు.