TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హోం మంత్రి సబితకు తలనొప్పిగా మారిన ప్రదీప్ రెడ్డి

Published on: Fri Apr 27, 2012 10:40AM

రాష్ట్ర హోం శాంఖామంత్రి సబిత ఇంద్రారెడ్డికి తన కొడుకు కార్తీక్ రెడ్డితో పాటు అతని స్నేహితుడు అయిన ప్రదీప్ రెడ్డి కూడా సమస్యగా మారారు. పటాన్ చేర్వులోని టి.ఆర్.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో కార్తీక్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి కలిసి చదువుకున్నారు. అదే కళాశాలలో చదువుకున్న బ్రాహ్మణయువతి లక్ష్మీస్రవంతిని కార్తీక్ రెడ్డి ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇంజనీరింగ్ చదువు అనంతరం ప్రదీప్ రెడ్డి కార్తీక్ పంచన చేరాడు. కార్తీక్ రెడ్డి ఏ పనిచేసినా, ఏ సెటిల్ మెంట్ చేసినా ప్రదీప్ రెడ్డి సలహాతోనే చేస్తాడని తెలుస్తోంది. మద్దెలచెర్వు సూరి హత్యకేసులో ప్రధాననిందుతుడైన భానును కూడా కార్తీక్ రెడ్డికి పరిచయం చేసింది ప్రదీప్ రెడ్డేనని తెలుస్తోంది.

 

 

 

విజయవాడ అన్నపూర్ణ ప్యాకేజ్ ఇండస్ట్రీ సెటిల్ మెంట్ వ్యవహారంలో ప్రదీప్ రెడ్డి హస్తముందని తెలుస్తోంది. కార్తీక్ రెడ్డి వివిధ మార్గాలద్వారా ఆర్జించిన కోట్లాది రూపాయల్లో సుమారు 100 కోట్ల రూపాయలు ప్రదీప్ రెడ్డి పేరుతొ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వందకోట్ల వ్యవహారంలోనే ప్రదీప్, కార్తీక్ ల మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ఈ అనుబంధం హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది. పరిస్థితులు విశామిస్తున్నాయని గమనించిన ఆమె తన అధికార నివాసం చెంత కనిపించవద్దని ప్రదీప్ రెడ్డిని గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.